vitamin therapy in telugu

Vitamin Therapy to Overcome Intellectual and Developmental Disabilities

Sept 2015: మానసిక వికలాంగులను మనలో ఒకరిగా కలుపుకోవటము మా ఆశయము.అది ప్రత్యేకమైన విటమిన్ బి12 ( మిధైల్ కొబాలమిన్తగిన మోతాదులో రోజు వేసుకొనుటవలన  సాధించవచ్చని మాఆలోచన. షుగరు, బిపి, గుండె జబ్బులు ఉన్నవారు, రోజు మందుబిళ్ళలు వేసుకుంటున్నట్లు వీళ్ళుకూడ మిధైల్ కొబాలమిన్ బిళ్ళలు వేసుకుని జనశ్రవంతిలో కలిసిపోయే అవకాశమున్నది.

మన శరీరానికి అవసరమైన Vitamin B12 మన శరీరముతినే ఆహార పదార్ధాలనుంచి తయారు చేసుకుంటుంది. విటమిన్ B12లో మిథైల్ కోబాలమిన్ ( Methylcobalamin ) అనే పధార్ధము ఉంటుంది. అది మన నరాలు సరిగ్గా పనిచేయటానికి అత్యవసరము. మిథైల్ కోబాలమిన్  లోపిస్తే వివిద రకాల నరాలకు సంభందించిన (neurological disorders) వస్తాయి.. జపాన్ శాస్త్రవేత్తలు మిధైల్ కొబాలమిన్ కి నరముకి సరిగ్గా పనిచేయటానికి అవసరమగు మైలిన్ (myelin) పొరను రిపేర్ చేసే గుణమున్నదని  కనుక్కొన్నారు. జపాన్ లో నిర్వహించిన రిసెర్చ్ లో వయో వృద్ధులకు మిథైల్ కోబాలమిన్ ఇస్తే వారి జ్ఞాపక శక్తి, చురుకుతనము పెరిగి నట్లు వివరించారు.

మన దేశములొ మిధైల్ కొబాలమిన్ ఉన్న మందులు చాలాఉన్నాయి. అవి సాధారణముగ వార్ధక్యముతో వచ్చు నరాలసమస్యలకు వాడుతున్నారు. విదేశాలలొ అక్కడక్కడ మిధైల్ కొబాలమిన్ ఆటిసం, సిపి వంటి మానసిక వికలాంగుల సమస్యలకు వాడిన వార్తలున్నాయి(రిఫరెన్సులకు, మరిన్ని వివరాలకు మాకు రాయండి). మన దేశములో మానసిక వికలాంగులకి వాడినట్లు సమాచారము లేదు.

మిధైల్ కొబాలమిన్ గురించి, అది వాడటము వలన మానసికవికలాంగులలో కలిగే మార్పు గురించి తెలియచెప్పటము మా కార్యక్రమము. మిధైల్ కొబాలమిన్ బిళ్ళలు  మీకు దగ్గరలో ఉన్న మందులదుకాణములొ దొరుకుతాయి. వీటి ధర కంపెనీని బట్టిపది బిళ్ళలు నాలుగు రూపాయలనుంచి, తొంభై రూపాయల వరకు ఉంటుంది. 5నుంచి 15 సంవత్సరాల పిల్లలకు రోజుకొకటి 500 mcg (microgram) , 15 సంవత్సరాలు పైబడినవారికి 1500 mcg బిళ్ళ చాలు. బిళ్ళ ఉదయము టిఫిన్ తరువాత వేయవచ్చును  రోజంతా చురుకుగా ఉంటారుమా ఆర్ధిక వనరులను బట్టి స్వయముగా కొనలేని వాళ్ళకి ఒకటి లేదా రెండు నెలలకు సరిపడిన బిళ్ళలు ఉచితముగా ఇస్తాము. గుణము కనపడితే ఆ తరువాత ఏర్పాటు వాళ్ళే చేసుకోవాలి. ఈ ప్రయత్నములొ కుటుంబ సభ్యుల పాత్ర ఎక్కువ. ఈ పత్రము చదివి మిధైల్ కొబాలమిన్ వాడటమా లేదా అన్నది, వైద్యుని అనుమతి పొందటము అన్నది వారే నిర్ణయించాలి. మా వద్ద ఉచితముగా మిధైల్ కొబాలమిన్ బిళ్ళలు తీసుకొనేవారు, వాడే భాధ్యత వారిదే అని రాసి ఇవ్వాలి.

Jan 2016: గత నాలుగు నెలల్లో వంద మందికి పైగా  మిధైల్ కొబాలమిన్ బిళ్ళలు వారి కుటుంబ సభ్యుల ఆమోదముతో వాడారు. వీరిలో 10% లో చాలా మార్పు వచ్చింది. 10%లో ఎటువంటి మార్పు కనపడలేదు. మిగిలిన వారిలో గుర్తించతగిన మార్పులు వచ్చాయి. చాలామంది విషయములో ఎటువంటి మార్పు ఆశించగలమో అర్ధముకాలేదు. వీరందరు హైదరాబాదు, కాకినాడ, యానాము, తూర్పు గోదావరి జిల్లా చిన్న గ్రామాలలో ఉంటున్నారు.

మేము గమనించిన విషయాలు: 5నుంచి 12 సంవత్సరాల పిల్లలొ మార్పు త్వరగా కనపడుతుంది. బిహేవియర్ ప్రాబ్లమ్స్, మెంటల్ రిటార్డేషన్, సెన్సర్ ఇంటిగ్రేషన్ ప్రాబ్లమ్స్జ్ఞాపక శక్తి సమస్య  ఉన్న పిల్లల్లో మార్పు కనపడింది, మాట స్పష్టత పెరిగినది, చొంగ కార్చటము తగ్గినది, ఏకాగ్రత పెరిగినది, అల్లరి తగ్గి కుదురుగ చెప్పిన మాట వినుట పెరిగినది. సిపి పిల్లల్లొ కొంచెము కదలిక వచ్చింది. ఆటిసం (ASD), హైపర్ ఆక్టివిటి, హైపెర్ సెన్సిటివిటి ఉన్న పిల్లల్లొ మార్పు కనపడ లేదు. మిధైల్ కొబాలమిన్ బిళ్ళలు ఫిట్స్ వచ్చే వారికి వాడకూడదు. ఫిట్స్ కి వాడే మందు, మిధైల్ కొబాలమిన్ బిళ్ళలు  పరశ్పరము వ్యతిరేకముగా పనిచేస్తాయి, ఇందుకు గాను వైద్య పరమైన పరిశోధనా ఫలితాలున్నాయి.

ముఖ్య గమనిక: పైన రాసిన వివరణ సూచన మాత్రము. మిథైల్ కోబాలమిన్  మీ పిల్లవాడికి, పిల్లకు వాడ వచ్చు, లేదు అన్నది మీరు కన్సల్ట్ చెసే డాక్టరు గారిని అడుగ వలెను.
----------------------------------------------------------------------------------------------------------------
MCPET వారు                                                       బాచ్ నెం                        బిళ్ళలు ఉచితముగా ఇచ్చారు. వీటిని                                            వయస్సు          కి వాడే భాధ్యత మాదే.
పేరు, చిరునామా, మొబైల్ నం                                                                                                                               



                                                                                     సంతకము/వేలి ముద్ర
--------------------------------------------------------------------------------------------------------------
వినతి: మీరు కనుక మీ పిల్లవాడికి/ పిల్లకి మిథైల్ కోబాలమిన్  బిళ్ళలు వాడితే వివరాలు మాకు పంపగలరు. ఆ వివరాలు మిగతా వారికి చాలా ఉపయోగపడతాయి. మీరు పంపవలసిన వివరాలు: పేరు, వయసు, సమస్య, వాడిన బిళ్ళల పేరు, కంపెనీ, మార్పులు (చెడు కూడ తెలుపగలరు)
---------------------------------------------------------------------------------------------------------------------

Dr. CVK Rao, M.tech, Ph.D, Mentally challenged persons empowerment trust, 507 Pakshiraj Apartments, sainathpuram, ECIL PO, Hyderabad-500062. e-mail cvkrao@gmail.com, mobile: 93933 49666

No comments:

Post a Comment