Request to family members

కుటుంబ సభ్యులకు విఙ్నప్తి
ప్రత్యేకమైన పిల్లలు, పెద్దలతొ నా ప్రయత్నాలు, పరిశొధనలు

నేను గత కొద్ది సంవత్సరములుగ వందల మంది  మానసిక వికలాంగులుగ పరిగణింపబడె వ్యక్తులు, పిల్లలు వారి తల్లి తండ్రులను అధ్యయనము చేసి వారి సమస్యల వివరాలు సేకరించాను. నేను గమనించినది- వీరి సమస్యలు ముఖ్యముగా మూడు రకాలు. అవి కదలికకు, చురుకుతనముకు, భాషకు సంబంధించినవి.  మనయొక్క చురుకుతనము నాలుగు అంశాలమీద ఆధారపడి ఉంటుంది. అవి- ఇంద్రియ సమన్వయ శక్తి (sensory integration), ఆలోచన, అవగాహన మరియు ఙాపకశక్తి.
మనము చేసే  ప్రతి పని పూర్తిచేయడానికి మెదడు వందలకొలది సున్నితమైన కండరాలను ఒక క్రమములొ కదిలిస్తుంది.  మనము ఏదైనా వస్తువు పట్టుకోవాలంటె కన్ను వస్తువుని చూస్తూ ఆవస్తువు గురించి, దాని పరిమాణము, రంగు వగైరా సంకేతాలను మెదడుకి పంపుతుంది. వస్తువు పట్టుకోటానికి అవసరమయిన కాలు, చేతి మరియు చేతివేళ్ళ కదలికను మెదడు ఆదేశిస్తుంది. ఇలాగే మనము ఏదైనా ప్రశ్నకు జవాబు ఇవ్వాలంటె చెవి ద్వారా మెదడుకి చేరిన మాటలు (శబ్దరూపములొ) అనుసరించి క్రమబద్దముగా మెదడు సమాధానము గొంతులోని శబ్దపేటిక కండరాలకు సంకేతాలు పంపుతుంది. పరిశీలించి చూస్తె మనము చేసే ప్రతి పని, చిన్న, పెద్ద తేడాలేకుండ ఇంద్రియసమన్వయశక్తిమీద ఎక్కువ ఆధారపడి ఉంటాయి. మెదడుకి చేరే సంకేతాలలొ 70% కంటిద్వార చేరుట వలన, మనము చేసె  చాలపనులు కంటి నుంచి వచ్చు సంకేతాలనుపయోగించి చేస్తాము కనుక కన్ను-మెదడు సమన్వయము చాల ముఖ్యము. ఇది మనము పసి పిల్లల ప్రవర్తనలొ గమనిస్తాము, పెంపొందించటానికి ప్రయత్నిస్తాము. ఏదొ కారణము వలన కంటినుంచి వచ్చు సంకేతాలు మెదడు గుర్తించనిచొ, మెదడు పంపే ఆదేశాలకు కన్ను చూచే విషయాలకు సంభంధముండదు. పర్యవసానము వింత ప్రవర్తన. మనము చేసే  ప్రతి పని పూర్తిచేయడానికి తాత్కాలిక ఙాపకశక్తి చాలాఅవసరము. ఉదాహరణకి, తాత్కాలిక ఙాపకశక్తి సమస్యకలవారు లోని నాలుగు శబ్దాలు వరుసక్రమములో పలుకలేరు. కాని, సట కాని పలుకుతారు. మనము గతములొ చూసినది, చెసినది, విన్నది మన శాశ్వత ఙ్నాపకశక్తిలో ఉంటుంది. మనము మరల అటువంటి దృశ్యము చూసినచో మెదడు శాశ్వత ఙ్నాపకశక్తి ఉపయోగించి గుర్తిస్తుంది. శాశ్వత ఙ్నాపకశక్తిలో సమస్య కలవారు అక్షరములు గుర్తించలేరు. ఆటువంటి పిల్లలు పెరిగినకొద్ది వ్యవహరఙ్నానము పెరుగుతుంది కాని అక్షరఙ్నానము లోపిస్తుంది.ఇంద్రియ సమన్వయశక్తి,ఆలోచన, అవగాహన మరియు ఙాపకశక్తి పెంపొందించుట చాలా అవసరము. పిల్లలు ఆడే  ఆటలు వీటిని పెంపొందిస్తాయి.
మనయొక్క బాషా ప్రవేశము నాలుగు అంశాలమీద ఆధారపడి ఉంటుంది. అవి: రాయుట, చదువుట,విన్నది అర్దము చేసుకొనుట, మాట్లాడుట. నాలుగు అంశాలు అమలుచేయటానికి ఆలోచన,అవగాహన, ఙాపకశక్తి ఉండాలి. కంటిలొపము వలనకాని, ఙ్నాపకశక్తి లోపము వలనకాని ఒక వ్యక్తి చదవలేకపోవచ్చును. అలాగే సున్నితమైన చేతి వేళ్ళ కండరాల లోపము వలనకాని, కంటిలొపము వలనకాని, ఙ్నాపకశక్తి లోపము వలనకాని ఒక వ్యక్తి రాయలేకపోవచ్చును. స్వరపేటిక కండరాల సమస్య వలనకాని, సైకలాజికల్ సమస్య వలనకాని, ఙ్నాపకశక్తి లోపము వలనకాని ఒక వ్యక్తి మూగ కాకపోయిన స్పష్టముగా మాట్లాడ లేకపోవచ్చును. ఇంద్రియ సమన్వయ శక్తి, ఆలోచన,అవగాహన, ఙాపకశక్తి  తక్కువగల వారికి అవి పెంపొందించే ప్రయత్నాలు ఫలించిన తరువాత బాషగురించి ప్రయత్నించాలి. అక్షరములు ముఖ్యముగా భారతీయ భాషలలొ రాయటానికి కన్ను-మెదడు-చేతి వేళ్ళు సమన్వయముగా పనిచేయాలి. ముఖ్యముగా రాసే చేతి మధ్యవేలు, చూపుడువేలు మరియు బొటనవేలు అవసరము. మధ్యవేలుతొ మనము ఎక్కడ అక్షరము రాయాలొ నిర్ణయిస్తాము. చూపుడువేలు, బొటనవేలు కదలికతొ వివిధ అక్షర ఆకారాలు వస్తాయి. కొంతమందికి సున్నితమయిన కదలికలు, ముఖ్యముగా చేతి వేళ్ళతో చేసేవి సమస్య అవుతుంది. వీళ్ళు రాయటానికి ప్రయత్నిస్తే అక్షరములు తిన్నగా రాయలేరు, పర్యవసానము వీళ్ళు చదవటము కూడ క్రమేణ మరచిపోతారు. అటువంటివారు చేతితొ రాయటము ప్రయత్నించక కంప్యూటరు టెక్నాలజి ఉపయోగించిన అతి సులువుగా చదవటము, రాయటము సాధించగలరు. మనము చదవటానికి అక్షరాలు ఒక వరుసక్రమములొ గుర్తుపట్ట గలగాలి. అనగా చదవటానికి కన్ను-మెదడు సమన్వయము ముఖ్యము అన్నమాట. వీటితోపాటు వరుసక్రమములో చదవాలని ఆలోచన, చదివిన అక్షరము గుర్తుతెచ్చుకునేందుకు శాశ్వత ఙాపకశక్తి, అక్షరాల వరుసక్రమము గుర్తించే తాత్కాలిక ఙాపకశక్తి (working memory) అవసరము. ఇవి పెంపొందించటానికి మెదడుకి వ్యాయామము అవసరము. మనకు ఎవరైన చెప్పిన విషయము అర్ధముకావలెనంటె, మాటకి సంబంధించిన వస్తువు కన్ను చూసి మెదడుకి తెల్పుతుంది అపుడు మెదడు ఆవస్తువుకి చెందిన ద్రశ్యము, శబ్దము మెదడులొ కూర్చుకొంటుంది.దీనికి మన మెదడు- చెవి సమన్వయము కూడ అవసరము. అంతేకాదు, వినిన శబ్దాలు / మాటలు ఒక వరుసక్రమములొ గుర్తుపట్ట గలగాలి.  వీటితోపాటు వరుసక్రమములో కూర్చాలి అని ఆలోచన, వినిన శబ్దము అర్ధము గుర్తుతెచ్చుకునేందుకు శాశ్వత ఙాపకశక్తి, శబ్దాల వరుసక్రమము గుర్తించే తాత్కాలిక ఙాపకశక్తి అవసరము. ఇవి పెంపొందించటానికి ఇంగ్లీషు లెర్నర్ ,"సెబ్రాన్","జికంప్రిస్" వంటి కంప్యూటర్ ప్రోగ్రామ్సు బాగా ఉపయోగపడతాయి.
మనలొ కొంతమంది మాట్లాడలేరు, మరి కొంతమంది మాట్లాడినది ఇతరులకు అర్ధముకాదు. సమస్యతొ భాధపడే వారు నాలుగు రకాలు.
 1)స్వరపేటిక సమస్య కలవారు: వీళ్ళు పూర్తిగ మూగ. చెప్పవలెననుకున్నది రాసి లేదా సంఙ్లల ద్వారా తెలియచేస్తారు. చెప్పదలుచుకున్నది కీ చేస్తె మాటలు శబ్ధరూపములొకి మార్చె "వాణి" (VAANI) వంటి కంప్యూటరు ప్రోగ్రాము ఉపయోగ పడుతుంది.
2)మాట్లాడగలిగి మాట్లాడని పిల్లలు: మానసిక వత్తిడికి కొంతమంది పిల్లలు మూగపోతారు. వీళ్ళలొ ఆత్మధైర్యము పెంచితే మామూలుగ మాట్లాడుతారు. "అడాసిటి"(AUDACITY) అను కంప్యూటర్ ప్రొగ్రాము వాడి కొంతమంది పిల్లలలొ మార్పు తేగలిగాము.
 3) మాట స్పష్టత లేనివారు: కొంతమంది దవడ, నాలిక, మూతి సరిగా ఉండకపోవుట వలన స్పష్టముగా మాట్లాడలేరు. వీరి చేత లంగ్ ఎక్సరసైజర్ ప్రతి రోజు 10- 15 నిమిషాలు ఊదిస్తే దవడలు, మూతి గట్టి పడె అవకాశమున్నది.
4) పదే పదే ఒకటే మాట పలికేవారు: వీరికి తాత్కాలిక ఙాపకశక్తి పెంపొందించాలి. ఇది పెంపొందించటానికి ఇంగ్లీషు లెర్నర్, "సెబ్రాన్","జికంప్రిస్" వంటి కంప్యూటర్ ప్రోగ్రామ్సు బాగా ఉపయోగపడతాయి.
అంతర్జాతీయముగా సమస్యల మీద జరుగుతున్న పరిశోధన ఫలితాలు జోడించగా తేలినదేమిటంటే,
 1) మెదడు సమస్యలన్నిటికి మూల కారణము మెదడులోని కొన్ని భాగాలకు తగినంత రక్తప్రసరణ జరగక పోవటము లేదా రక్తములొ తగినంత ప్రాణవాయువు లేకపోవటము. ఇది పురిటిలొ జరిగిన సంఘటన కావచ్చును, చంటిబిడ్డ వయస్సులొ జరిగిన అనారోగ్యము లేదా దెబ్బవలన కావచ్చును, లేదా మెదడుకి  గతములొ తగిలిన దెబ్బవలన కావచ్చును.  
2) మెదడు చాలా శక్తివంతమైనది.  వయసుతొ నిమిత్తము లేకుండా తగిన శిక్షణ ఇస్తే మెదడుకి సంబందించిన చాలా సమస్యలకు (ముఖ్యముగా కదలిక, భాష, చురుకుతనము సమస్యలకుప్రత్యామ్నాయము మెదడు ఏర్పాటు చేసుకోగలదు. మనము మెదడులో చాలా తక్కువ భాగము మాత్రమే ఉపయోగిస్తాము, కొంతమంది శాస్త్రవేత్తలు మనము మెదడులొ బహు కొద్ది శాతము మాత్రమే ఉపయోగిస్తామంటారు. కారణము వలనైన మెదడులొ ఒక భాగము పనిచేయకపోతె అటువంటి వేరొక భాగము కొరకు ప్రయత్నిస్తుంది. ప్రయత్నము మనము ఓపికతొ శిక్షణ ఇవ్వటము ద్వారా జరుగుతుంది. విషయములొ శిక్షణ ఇవ్వాలి, ఎంతకాలము శిక్షణ ఇవ్వాలి అన్నది వారి సమస్యమీద ఆధారపడి ఉంటుందిశిక్షణ చిన్న పిల్లలకి తక్కువకాలము, పెద్దపిల్లలకు ఎక్కువ కాలము, యువకులు వ్రద్ధులకు చాలాకాలము పట్టవచ్చును. శిక్షణ మెదడుకి ఇస్తే ఎక్కువ ఫలితముంటుంది కాని అవయవాలకు ఇస్తే అంత ఉపయోగముండదు.
అందరు పిల్లలకు అందులో ప్రత్యేకమైన పిల్లలకు ఉపయోగపడేవి ఆరు అంశాలు ఉన్నాయి. ఇందులొ కొన్ని ఇంటివద్ద కుటుంబ సభ్యులు చేయగలిగినవి, వాళ్ళు చేస్తే మంచి ఫలితాలిచ్చేవి  ఉన్నాయి. మరియు మనము ఇంటి వద్ద వీటిని ఏర్పాటుచేస్తె వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చు సంస్థల ప్రయత్నాలకు బలపరిచిన వారిమవుతాము.  మనము జీవించటానికి గాలి, నీరు, ఆహారము అత్యవసరము. మనము అరోగ్యముగ జీవించటానికి తినిన ఆహారము జీర్ణము కావాలి. మనము తినిన ఆహారము జీర్ణించుకోవటానికి శారీరక వ్యాయామము అవసరము. మనము ఏదైన విషయము గురించి ఆలోచిస్తున్నామంటే దానికి మెదడు కారణము. మన మెదడు అభివ్రద్ధికి మెదడుకి వ్యాయామము అవసరము. అటలు పిల్లలలో పోటీ తత్వము పెంచుతాయి. సరియైన పోటీ తత్వము సర్వతోభివ్రద్ధికి దారి తీస్తుంది. నేను గాలి, నీరు, ఆహారము, ఆటలు, శారీరక వ్యాయామము, మెదడుకి వ్యాయమముల ప్రభావము ప్రత్యేకమైన పిల్లల అభివ్రద్ధి మీద ఎంత ఉన్నది అనే విషయము అధ్యయనము చేస్తున్నాను. ఆ అధ్యయనములొ భాగము ఈ విఙ్నప్తి. దిగువ వివరణ చదివి, మీ అభిప్రాయాలు తెలియచెయగలరు.
గాలి: మనము ఊపిరితిత్తులనిండుగ గాలి పీల్చాలి. ఇది మనము చిన్న నాటినుంచి నేర్చుకున్న విషయము. కొంత మంది ఉపిరితిత్తుల నిండా గాలి పీల్చరు, మరి కొంత మంది నోటితొ గాలి పీలుస్తారు. ముఖ్యముగ మాట అస్పస్ఠత లేదా చొంగ కార్చె పిల్లలు నోరు మూసి ఉంచటపోవటము గమనించవచ్చును. గాలి పీల్చటము అసంకల్పిత చర్య (అనగా మెదడు ప్రమేయము లేకుండా జరుగుతుంది). కాని, ఊపిరితిత్తులనిండా గాలి పీల్చటము అన్నది సంకల్పిత చర్య. మెదడునుంచి వచ్చె ఆదేశాల మేరకు జరుగుతుందిఈ ఆదేశాలు అమలు జరగటము మెదడు పర్యవేక్షిస్తుంది. ఇది చాల క్రమ బద్దముగ జరుగుతుంది. ఏ కారణము వలనైనా క్రమము తప్పితే ఊపిరితిత్తుల నిండుగ గాలి పీల్చటము సాధ్యపడదు. మెదడు పంపే ఆదేశాలు ఊపిరి పీల్చటముకొరకు నిర్దేశించిన కండరాలు, నరాల సముదాయాలు ఆచరించని పక్షములొ క్రమము తప్పే అవకాశమున్నది. క్రమ శిక్షణతొ యోగ లెదా ప్రాణయామముతొ తప్పిన క్రమము సరిదిద్దవచ్చును. అది వీలుకాని వారికి లంగ్ ఎక్సర్సైజర్ ఉపయోగపడుతుంది. దీనితొ మనము నోటిద్వారా ఊపిరితిత్తుల నిండుగ గాలి పీల్చవచ్చును. ఇందులో గల మూడు బంతులు, మనము ఎంత గాలి పీల్చినది సూచిస్తాయి. దీనిని వాడటానికి పైపు నోట్లొ పెట్టుకుని బలముగా గాలి లోపలకు పీల్చాలి. ప్రతి రోజు పది/పదిహేను నిమిషాలు కనీసము రెండు బంతులు పైకి తేలేలా నోటితొ గాలి పీలిస్తే గొంతులోని కండరాలు మెదడు స్వాధీనములొకి వచ్చే అవకాశమున్నది.
నీరు: మన శరీరము ఆరోగ్యముగ ఉండటానికి నీరు చాలా అవసరము. రోజుకి దాదాపు రెండు లీటర్ల నీరు తాగాలి. కొంతమంది ఇది ఆచరించకపోవుట వలన సమస్యలు ఎదుర్కుంటున్నారు. నీరు తాగటముకూడ మన మెదడు చేయిస్తుంది. గొంతులొ పడిన నీళ్ళు గుటక వేయటములొ మెదడు ప్రమేయము లేకపోయినా, తగిన మోతాదులొ మాత్రమే నీరు నోట్లొ చేర్చుకోవటములొ మెదడు కీలక పాత్ర వహిస్తుంది. ఇది మనము చిన్న పిల్లలకు నేర్పుతాము. ఏ కారణము వలనైనా నీరు తాగటము రాని పిల్లలు ఎదిగిననకొద్ది సమస్య పెరుగుతుంది. ముఖ్యముగా ప్రత్యేకమైన పిల్లలకు గొంతులొ జారిపోవు మోతాదులొ నీరు, ద్రావకాలు పట్టటము గమనించాను. అటువంటి పిల్లలకు చిన్న తనములొ గ్లాసులొ నీళ్ళు స్ట్రాతొ తాగటము అలవాటుచేస్తే క్రమేణ వారి గొంతులోని కండరాలు మెదడు స్వాధీనములొకి వచ్చే అవకాశమున్నది.
ఆహారము: మన శరీర అభివ్రుద్ధికి పౌష్టిక ఆహారము అవసరము. అటువంటి ఆహారము సరిగ్గా తిని జీర్ణించుకోవటానికి నమిలి మింగటము కీలకము. చంటి పిల్లలకు సంవత్సరము నిండేసరికి ఆహారము నమిలిమింగటము అలవాటు చేస్తాము. ఇలా నమిలి మింగటములొ మెదడు కీలక పాత్ర ఉన్నదని గమనించక పోవచ్చును. మనము తినే వస్తువు గట్టితనము, అందులొ ఉన్న పదార్దాల లక్షణాలకు అనుగుణముగ మెదడు మన దవడలోని కండరాలని కదిలిస్తుంది. ప్రత్యేకమైన పిల్లలలో కొంతమంది మెదడు సమస్య వలన నమిలి మింగరు. వీరిలొ కొంతమంది ఆరోగ్యముగ ఉన్నట్టు కనపడతారు. దీనికి కారణము వాళ్ళు తినే ప్రత్యేకమైన ఆహరము, ఇది మెత్తగా నమలటము అవసరము లేని రూపములొగాని, పాల వంటి ద్రవ పదార్దాలలొ కరిగిపోవులా ఉంటుంది. తరుచు అజీర్తితొ , అన్నము తినగానే విరేచనము చేసే ప్రత్యేకమైన పిల్లలను నమిలి మింగుతున్నారా లేదా అన్న విషయము గమనించుట ముఖ్యము.
శారీరక వ్యాయామము: పిల్లలకి, పెద్దలకు ప్రతి రోజు తగినంత శారీరక వ్యాయమము ఉండాలి. లేనిచొ లావు వచ్చి అనేక సమస్యలకు దారి తీస్తుంది. ప్రత్యేకమైన పిల్లలు, పెద్దల విషయములో ఈ పరిస్తితికి అవకాశము ఎక్కువ. నరాల బలహీనత, సున్నితమైన కండరాల సమస్య కల పిల్లలకు స్ప్రింగ్ ఎక్సరుసైజర్ ఉపయోగపడుతుంది. ప్రతి రోజు 10 నిమిషములు దీనితొ వ్యాయామము చేస్తే చేతి కండరాలు అభివృద్ధి చెందుతాయి. చేతి కండరాలతొపాటు ఊపిరితిత్తులు అభివృద్ధి చెంది శరీరము ఏ వంకరలేకుండ పెరిగే అవకాశమున్నది.
ఇంగ్లీషు లెర్నర్: ప్రత్యెకమైన కంప్యూటర్ ప్రోగ్రాముల ద్వారా చురుకుతనము, భాష సమస్య కలవారికి ఇంద్రియసమన్వయశక్తి, రాయటము, చదవటము, మాట్లాడటము, ఆలోచన మరియు అవగాహన పెంపొందించవచ్చును. దీని వలన మెదడుకి తగిన వ్యాయామము కలుగుతుంది. సున్నితమైన కండరాల సమస్య వలన రాయలెని వారు కంప్యూటర్ కీబోర్డు ఉపయోగించి అనుకున్నది రాసే అవకాశమున్నది. పిల్లలకు ఇంద్రియ సమన్వయశక్తి, ఙ్నాపకశక్తి పెంపొందించటానికి, ఇంగ్లీషు అక్షరాలు, 0 నుంచి 9 వరకు అంకెలు నేర్పించటానికి  ఇంగ్లీషు లెర్నర్ బాగా ఉపయోగపడుతుంది. చేతి వేళ్ళు స్వాధీనములేని పిల్లలకు అక్షరాలు, అంకెలు గుర్తించటము, ఆ అక్షరాలున్న కీ నొక్కటము చేతివేళ్ళతొ బలపము లేదా పెన్సిల్ పట్టుకొని పలక మీద లేదా పుస్తకములొ రాయటముకంటే చాలా సులువు. మరియు పిల్లలు వేగముగ నేర్చుకోగలుగుతారు.
ఆటలు: పిల్లలు ఆనందముతొ అడే బంతి ఆటలు చాలా ఉన్నాయి. బంతి ఎగరవేసి లేదా నేల మీద కొట్టి  బంతి పడకుండా పట్టుకుంటే ఇంద్రియ సమన్వయశక్తి, కన్ను, కాళ్ళూ, చేతుల సమన్వయశక్తి పెంచుతాయి. బంతి వేగముకి అనుగుణముగా ఇంద్రియ సమన్వయశక్తి లేదా అవయవాల సమన్వయశక్తి  పని చేయాలి. లేనిచొ బంతి క్రింద పడిపోతుంది. ఇంద్రియ సమన్వయశక్తి లేదా అవయవాల సమన్వయశక్తి సమస్యలు కల పిల్లలు ఈ బంతి అటలు ఆడలేరు. ఈ సమస్యలు కల పిల్లలకి బంతి అటలు తప్పక ప్రయత్నించాలి, సాధించాలి. కదలిక సమస్య కలవారిని దోమతెర వంటి దానిలొ ఆడిస్తె పదే పదే మనము బంతికోసము పరుగెట్టనక్కరలేదు. బంతిఆడుతున్నపుడు బయటనుంచి మనము 1 నుంచి 100 వరకు చెపుతు, పిల్లలను అంకె చెపినపుడు బంతి ఎగరవేయమంటె పిల్లలకు టైమింగ్ కూడ వస్తుంది. ఇలా ఆడుతున్నపుడు మనము బయటనుంచి చెప్పే అంకె పలికితే స్వరపేటిక సమన్వయ శక్తికూడ పెరుగుతుంది. ఇలా ఆడుతున్నపుడు ఎన్ని సార్లు బంతి నేల మీద పడకుండ ఆడేది లెక్క పెడుతు పలికితె కన్ను-మెదడు-చేతితొ-స్వరపేటిక సమన్వయ శక్తికూడ పెరుగుతుంది.  

వికలాంగుల వెలుగు
చిరువోలు వెంకట కామేశ్వరరావు, పిహెచ్.డి
507 PAKSHIRAJ APTS, SAINATHPURAM,ECIL PO,HYDERABAD 500062
cvkrao@gmail.com, mobile: 93933 49666



No comments:

Post a Comment